logo

ఆదివాసి భూముల రికార్డులు మార్చుకున్న వారిపై చర్యలు తీసుకోండి లీగల్ నోటీసులు జారీ చేసినా స్పందించని రెవెన్యూ అధికారులు తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ ఆరోపణ

ఆదివాసి భూముల రికార్డులు మార్చుకున్న వారిపై చర్యలు తీసుకోండి

లీగల్ నోటీసులు జారీ చేసినా స్పందించని రెవెన్యూ అధికారులు

తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ ఆరోపణ


జగిత్యాల / రాయికల్ :

అన్యాయంగా గత ప్రభుత్వ, రాజకీయ నాయకుల అండదండలతో ఆదివాసి భూములు కాజేయాలని దొంగ తనంగా భూ మార్పిడి చేసుకున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదివాసీ హక్కుల పోరాట యోధుడు,
తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన బాధితులను కలిసిన అనంతరం జగిత్యాలలో విలేఖరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం హయాంలో స్థానిక ఎమ్మెల్యే అండదండలతో మండల స్థాయి నాయకుని ఆధ్వర్యంలో రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామంలో 176 సర్వే నంబర్ యందు జాడి భీమయ్య ( ఆదివాసీ ) భూమిని (7.13 ఎకరాలు ) అదే గ్రామానికి చెందిన గుడిగిల్లా సత్తయ్య అక్రమంగా రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకొని భూ మార్పిడి చేసుకున్నాడు అని ఆరోపించారు.
2018 లో ధరణి యందు ఇట్టి భూమిని తన పేరున నమోదు చేయించు కున్నారని అన్నారు. అట్టి విషయం తెలిసి బాధితులు తుడుం దెబ్బ నాయకుల సహాయంతో మండల స్థాయి నుండి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు పోరాటం చేసినా లాభం లేక పోయిందన్నారు. ఇప్పటి ప్రభుత్వం అయినా అట్టి అక్రమార్కులని చట్టపరంగా కఠినంగా శిక్షించి సంబందింత ఆదివాసీలకు న్యాయం చేయాలని కోరారు. ఇట్టి విషయంపై లీగల్ గా అడ్వకేట్ కిరణ్ కుమార్ చెక్రపాటితో నోటీసులు కూడ పంపడం జరిగిందన్నారు. అయినా ఇక్కడి అధికారుల్లో ఎలాంటి చలనం రావడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి మా అదివాసిలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో హై కోర్టు ను ఆశ్రయిస్తామని గుర్రాల రవీందర్ హెచ్చరించారు.

0
116 views